VZM: విశిష్ట కార్తీకమాసం సందర్భంగా 41 రోజులు స్వాములకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కౌశిక్ ఈశ్వర్ దంపతులు అన్నారు. విజయనగరం స్థానిక NCS రోడ్డులో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముగింపులో వారు పాల్గొని, స్వాములకు ప్రసాద వితరణ చేపట్టారు.