VSP: కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను విస్మరించిందని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మంగళవారం 36వ వార్డు ముస్లింలు 200 మంది వైసీపీలో చేరారు. దక్షిణ నియోజకవర్గంలో కూటమిపై వ్యతిరేకతతో భారీగా చేరికలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు.