E.G: పెరవలి మండలం తీపర్రు గ్రామంలోని ఏటిగట్టు పై నుంచి మంగళవారం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బ్రేక్ ఫెయిల్ కారణంగా బస్సు బోల్తా కొట్టినట్లు డ్రైవర్ వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.