NTR: నందిగామ పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఎస్సైగా మహతి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. అనంతరం సీఐ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.