KDP: లింగాల మండలం మురారిచింతల క్రాస్ వద్ద కేబుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల DSP మురళినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరుకు చెందిన జమ్మయ్య, నాగరాజు అనే వ్యక్తులు దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి ఒక ఆటో,మోటర్ కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు.