ప్రకాశం: ప్రకాశం జిల్లా పీడీసీసీబీ అధికార పర్సన్ ఇన్చార్జి (పీఐసీ)ల పదవీ కాలాన్ని పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీసీసీబీకి పీఐసీగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈనెల 27 నుంచి ఆరు నెలలపాటు వీరి పదవీకాలాన్ని పెంచారు.