KDP: కలసపాడు మండల నూతన వ్యవసాయ అధికారిగా విజయ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధికారి ప్రసాద్‌రెడ్డి బదిలీ కావడంతో జిల్లా అధికారులు ఆయనను నియమించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ కుమార్ తెలిపారు.