నెల్లూరు సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జైలులో అధికారుల పనితీరు బాగుందని, ఖైదీలు వస్తువులు తయారు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం జైలు, అగ్నిమాపక శాఖల్లో నియామకాలు చేపట్టలేదని, అందుకే ఖాళీలు ఉన్నాయన్నారు. ఆ రెండు శాఖల్లో త్వరలోనే నియామకాలు చేపడతామని మంత్రి వెల్లడించారు.