SS: గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో యాదవ కల్యాణ మండప భూమిపూజలో మంత్రి సవిత ఆదివారం పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని, ఆదరణ 3.0లో యాదవులకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయని తెలిపారు. యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి రూ.5,00,116ల సొంత నిధులను మంత్రి ప్రకటించారు.