సత్యసాయి: ఓబులదేవరచెరువు మండల కేంద్రంలో ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వడ్డే ఓబన్న త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.