VZM: రాజాం తిరుమల కాంప్లెక్స్‌లో ఉన్న రెండు సెల్ పాయింట్లలో చోరీ జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి షాపుల్లోకి చొరబడి ముప్పావు తులం ఉన్న రెండు బంగారు రింగులు, రూ.25,000 దోచేశాడు. సీసీటీవీలో చోరీ చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.