అన్నమయ్య: చిట్వేల్ మండలం, తుమ్మకొండ గ్రామానికి చెందిన పుల్లగంటి ఈశ్వరయ్య గారికి CMRF ద్వారా రూ.34,761/ చెక్కును రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి CMRF ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.