NDL: డోన్ మండలం ఓబుళాపురం గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ను శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ ద్వారా గ్రామస్తుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.