AKP: పాయకరావుపేట ప్రధాన రహదారికి అనుకుని ఉన్న వివాదాస్పద స్థలంలో పంచాయతీ ఏర్పాటుచేసిన బోర్డు తొలగింపుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో డేవిడ్ గురువారం తెలిపారు.1985లో సర్వేనెంబర్ 132/3లో వేసిన లేఔట్లో పంచాయతీకి స్థలం కేటాయించారు. ఆ స్థలంలో గత నెలలో బోర్డు ఏర్పాటు చేసినట్లు డేవిడ్ తెలిపారు. ఈ స్థలంపై వివాదం కోర్టులో ఉందన్నారు.