CTR: ఈ నెల 4న (గురువారం) పౌర్ణమి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఇన్స్‌స్పెక్టర్ కృష్ణ మూర్తి మంగళవారం తెలిపారు. రాత్రి 7 గంటలకు గరుడోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.