GNTR: నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలోని ఒక కాలేజీ వద్ద గంజాయి తాగుతున్న ఏడుగురు యువకులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు ప్యాకెట్లలో మొత్తం 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘సంకల్పం – మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం’ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.