కృష్ణా: జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చల్లపల్లి మండల మాజీ ఆర్ఐ ఘంటసాల కృష్ణమోహన్ BJPలో చేరారు. ఆదివారం పునాదిపాడులో నిర్వహించిన ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు PVN Madhav పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ప్రజాసేవలో మరింతగా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో బీజేపీ చేరినట్లు కృష్ణమోహన్ తెలిపారు.