VSP: ఆనందపురం ఎమ్మార్వో కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెవిన్యూ సంబంధిత ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేలో తప్పులు జరగకుండా రైతులకు సరైన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలన్నారు.