GNTR: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేయాలని శుక్రవారం ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, రౌడీ షీటర్లపై బైండోవర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. రికవరీ ఏజెంట్ల వేధింపులను అరికట్టేందుకు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, ప్రజల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఉండాలని అధికారులను ఆదేశించారు.