కృష్ణా: కోడూరు మండలం సాలెంపాలెం-వేణుగోపాలపురం రహదారిపై ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై దిగబడిపోయింది. వేణుగోపాలపురం నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని రైతులు వాపోయారు. ఈ రహదారి పూర్తిగా అధ్వానంగా ఉండటం వల్ల ప్రయాణం నరకయాతనగా మారిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేశారు.