TPT: కేవీబీ పురంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహ స్థాపనకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ శంకర్ రెడ్డి భూమి పూజ చేశారు. మండల నాయకుల దశాబ్దాల కల ఈ భూమి పూజతో నెరవేరిందని మండల టీడీపీ అధ్యక్షుడు మునస్వామి యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రతిష్ఠిస్తామని శంకర్ రెడ్డి పేర్కొన్నారు.