అన్నమయ్య: సోమవారం మదనపల్లి–అనంతపురం జాతీయ రహదారిపై ములకలచెరువు సమీపంలోని వేపూరికోట వద్ద పొగమంచు కారణంగా 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాముల ఇన్నోవా కారును, చిత్తూరు నుంచి అనంతపురం వైపు వస్తున్న మారుతి స్విఫ్ట్ కారు ఢీకొట్టడంతో స్విఫ్ట్ కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఎస్సై నరసింహుడు తెలిపారు.