ASR: విధులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కొయ్యూరు ఎంఈవో ఎల్.రాంబాబుపై డీఈవో పీ.బ్రహ్మాజీరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరచుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం డీఈవో కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే ఆ పాఠశాలకు హెచ్ఎంగా వ్యవహరిస్తున్న ఎంఈవో ఆ సమయంలో పాఠశాలలో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.