ATP: అనంతపురంలో విద్యార్థి సంఘాలను పాఠశాలల్లోకి రాకుండా నిషేధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనలో పాల్గొన్న నాయకులు, విద్యార్థుల సమస్యలను అణచివేయడానికి ఈ జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేసే విద్యార్థి సంఘాలు అవసరమన్నారు.