GNTR: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఫిరంగిపురం మండలంలో కొత్త గృహాలు పొందాలనుకునే అర్హుల కోసం ప్రభుత్వం దరఖాస్తు గడువును రేపటి వరకు పొడిగించింది అని ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్రామీణ ఆవాస్ సర్వే- 2025 యాప్ ద్వారా నమోదు చేసుకోవాలనుకున్న లబ్ధిదారులు గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలన్నారు.