కాకినాడ నగరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు-2026 ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మే 27, 28 తేదీలలో 10 క్లస్టర్ల పరిధిలో ఘనంగా మహానాడు నిర్వహించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు సందేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రతి క్లస్టర్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.