E.G: నల్లజర్ల మండలం అనంతపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన ఆలపాటి ఆకాశ్‌పై చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ సువర్ణ రాజు వినతి పత్రం అందజేశారు. ఈ అక్రమ రవాణాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిని ఉపేక్షించబోమని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.