కృష్ణా: వేలేరు గ్రామంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు నిల్వ స్థలాల కొరత, కొనుగోలు కేంద్రాల ఆలస్యం,రవాణా సౌకర్యాల లోపం, వర్షం వల్ల ఎదురవుతున్న నష్టాల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.