KRNL: ప్రజలకు చట్టాలపై మహిళా పోలీసులు అవగాహన కల్పించాలని కోసిగి సీఐ మంజునాథ్ అన్నారు. ఇవాళ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ నందు ఎస్సై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. నాటుసారా, పేకాట స్థావరాలను గుర్తించాలని ఆయన అన్నారు. మహిళా పోలీసులు గ్రామ స్థాయిలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.