EG: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సీఐటీయూ 18వ జాతీయ మహాసభల పోస్టర్ను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. సుందర్ బాబు ఆవిష్కరించారు. కనీస వేతనం, లేబర్ కోడ్లు, ప్రభుత్వ రంగ రక్షణ, కార్మిక హక్కులపై చర్చించి ఐక్యపోరాటాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జనవరి 4న ఆర్కే బీచ్ సభకు భారీగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.