కృష్ణా: పెడన మండలం బలిపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు ఇటువంటి సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్లు కీలకమని తెలిపారు.