PPM: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి సక్రమంగా అందేలా చూడటమే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో వినూత్న చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్లో గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.