SS: పాత విద్యుత్ తీగల స్థానంలో కొత్త లైన్లు మారుస్తున్నందున ఆదివారం కదిరి టౌన్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కొలమి ఏరియా, నానా దర్గా, జోక్ పాల్యం, టైటానిక్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కోత విధించనున్నారు. అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ప్రజలు సహకరించాలని ఏడీఈ అంజి ప్రసాద్ కోరారు.