గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే గళ్ళా మాధవికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిధిలో ఉండే సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.