సత్యసాయి శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసేందుకు పుట్టపర్తిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కల్ప వృక్షం గుట్ట ప్రాంతంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. అనుమానితుల కదలికలను పరిశీలించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.