ATP: తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన తలపెట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కార్యక్రమాన్ని యాడికి మండల కేంద్రానికి మార్చారు.