కోనసీమ: రావులపాలెంలోని శ్రీ సత్య సాయి సేవా కేంద్రంలో ఈనెల 4వ తేదీ నుంచి టెన్త్ చదివిన వారికి ఉచితముగా కంప్యూటర్ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ లో ఎం.ఎస్ ఆఫీస్ ట్యాలీ వంటి కోర్సులు నేర్పుతారు. శిక్షణ తీసుకునేవారు ఈనెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10గంటలకు సత్య సాయి సేవా కేంద్రంలో జరిగే అవగాహన కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.