కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గ్రామం అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇల్లు కూలిపోయిన బాధితులకు గృహ పట్టాలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇళ్లను కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా గృహ పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు.