NTR: విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో రోడ్డు భద్రతా, చైతన్యం పెంపొందించడానికి వాహనదారులకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ హెల్మెట్, ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ షరీనా బేగం, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.