ప్రకాశం: కొమరోలులో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారి ఏ.ఈ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మరమ్మత్తుల కారణంగా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని హసనపురం,తాటిచెర్ల గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన తెలిపారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.