VSP: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు హాసిని వర్మ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి, బాలలదినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి, పిల్లలకు చాక్లెట్లు పంచారు. ఈ కార్యక్రమం భీమిలి ఇంఛార్జ్ సవరవిల్లి రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.