KDP: చాపాడు మండల పరిషత్ అధ్యక్షుడు టి. లక్షమయ్య యాదవ్ అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొంది స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న కడప జిల్లా వైసీపీ నాయకులు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ సలహాదారుడు సంబటురు ప్రసాద్ రెడ్డి, జిల్లా ZP వైస్ ఛైర్మన్ బాలయ్య తదితరులు ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.