ASR: అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ కొండ శిఖర PVTG కొందు గిరిజన గ్రామం తలారపాడులొ 14కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామంలో స్కూల్, అంగన్వాడి కేంద్రం లేదన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేక బియ్యం తీసుకోవాలంటే సుమారు15 కిలోమీటర్లు ఎత్తైన కొండల్లో నడుచుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నారు.