KRNL: జూన్ 15 నుంచి జులై 14 వరకు జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంటింటి సర్వేలో బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సూచించారు. పత్తికొండలో నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో ఓటరు జాబితా సవరణపై నాయకులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కావాలని, అనర్హుల పేర్ల తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు.