ELR: జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన పనులను నిర్దేశిత వ్యవధిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించి, తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. నీటి సరఫరా మెరుగుదలకు అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలన్నారు.