E.G: పెరవలి మండలం తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే మంత్రి సంబంధిత యాజమాన్యంతో, అధికారులతో మాట్లాడారు. గాయపడిన చిన్నారులకు తక్షణ వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా వాహనాన్ని సకాలంలో మరమ్మతు చేయించాలని స్కూల్ యాజమాన్యానికి సూచించారు.