SKLM: వికలాంగులకు ఇళ్ళస్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని విభిన్న ప్రతిభావంతుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు ఆవుల వేణుగోపాల్ కోరారు. మందసలో ప్రధాన కార్యదర్శి పోకల మోహన్రావు ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. రీ వెరిఫికేషన్ పూర్తయిన సదరం సర్టిఫికెట్లు చాలామందికి రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.