కృష్ణా: గుడివాడలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. నాగవరప్పాడులో ఆర్టీసీ బస్సు, ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఏలూరు నుంచి మచిలీపట్నం వెళుతున్న బస్సును వేగంగా వచ్చి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.