KRNL: రైతులకు ఎరువులు, మందులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోళగుంద వ్యవసాయ అధికారి ఆనంద్ లోక్‌దళ్ అన్నారు. ఎరువులు, పురుగు మందుల డీలర్లతో స్థానిక రైతు సేవా కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీలర్లు తమ దుకాణాల్లో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నెల సేల్స్ రిపోర్టును ఏవో కార్యాలయంలో అందించాలన్నారు.