NDL: బనగానపల్లె మండలం సాధుకొట్టంకి చెందిన టీడీపీ నేత సంగు శ్రీనివాస రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బీసీ సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.